Israel-Hamas War: 48 మంది ఇజ్రాయిలీ బందీలకు హమాస్ “వీడ్కోలు”.. చంపేస్తామని పరోక్ష హెచ్చరిక..
- ఇజ్రాయిలీ బందీలకు హమాస్ ‘‘వీడ్కోలు’’..
- చంపేస్తామని పరోక్ష హెచ్చరిక..
- గాజాలో ఇజ్రాయిలీ దాడులపై వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం ఇప్పటికీ ఇజ్రాయిల్ రాజకీయ, సైనిక వ్యవస్థల్ని వెంటాడుతోంది.
దీనికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, సైనిక అధికపతి ఎయాల్ జమీర్ కారణం అవుతారని హమాస్ దుయ్యబడుతోంది. నెతన్యాహు అహంకారం వల్లే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా సిటీలో భారీ దాడులు నిర్వహిస్తోంది. టెన్నెళ్లు, భవనాలను బాంబులతో ధ్వంసం చేస్తోంది. 60 మందికి పైగా పాలస్తీనియన్లు తాజా దాడుల్లో మరణించినట్లు గాజా వైద్య అధికారులు చెబుతున్నారు. షేఖ్ రద్వాన్, తెహ్ అల్ హావా వంటి ప్రాంతాల్లో ఐడీఎఫ్ భీకర దాడులు చేస్తోంది. గత రెండు వారాల్లో 20 కంటే ఎక్కువ టవర్లను కూల్చివేసింది.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Read Also: H-1B visa: భారతీయులకు గుడ్ న్యూస్.. H-1B వీసాపై వైట్‌హౌజ్ కీలక ప్రకటన..
ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల బందీలకు ప్రాణహాని ఉందని హమాస్ చెబుతోంది. దీనికి ముందు ఇజ్రాయిలీ బందీ ఒకరు తన సొంత సమాధిని తవ్వుకుంటున్న వీడియో వైరల్ అయింది. అయితే, దీనిని మానసిక యుద్ధంగా అమెరికా ఖండించింది. బందీల విడుదల కోసం ఒక ఒప్పందం చేసుకోవడానికి నెతన్యాహూ ప్రభుత్వంపై సొంత దేశంలో ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయిల్‌లో ఉంటున్న ఖైదీలను విడిచిపెట్టాలని భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీడ్కోలు చిత్రం బయటకు వచ్చింది.
సోమవారం నాటికి ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా సహా 10 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా అధికారికంగా గుర్తించనున్నాయి. దీంతో, ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇదే జరిగితే ఇజ్రాయిల్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, హమాస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం చూస్తే, ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తే, తాము బందీలను చంపేస్తామని పరోక్షంగా చెప్పింది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!