గాజా స్వాధీనం.. బందీలను రక్షించడం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందగా.. పదుల కొద్ది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక గాజా కాలిపోతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. ఎత్తైన భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని.. ఇందులో భాగంగా భారీ వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాము బందీల విడుదలపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉగ్రావాదుల మౌళిక సదుపాయాలను కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి నుంచి భారీ దాడులు జరుగుతున్నాయని.. పాలస్తీనా భూభాగంలోని అతి పెద్ద నగరంలో ఇంటెన్సివ్ ఆపరేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం తమ సైన్యం పని చేస్తోందని చెప్పారు. ఇక వెనక్కి వెళ్లేది లేదని.. మిషన్ పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గేదేలేదని కాట్జ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ చైల్డ్ స్టార్ ఉమర్ గుండెపోటుతో మృతి
ప్రస్తుతం హమాస్ చెరలో ఇంకా 48 మంది బందీలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 20 మంది వరకు సజీవంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హమాస్‌తో చర్చలు జరుపుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక గత వారం ఖతార్‌లో మకాం వేసిన హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు హమాస్ నాయకులు, ఒక ఖతార్ అధికారి చనిపోయారు. ఇది అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ఇజ్రాయెల్ తీరును పలు దేశాలు ఖండించాయి. ఇక ఈ దాడుల వెనుక తన ప్రమేయం లేదని ట్రంప్ ప్రకటించారు. వాస్తవంగా ఖతార్‌పై దాడి చేయడానికి మొస్సాద్, ఐడీఎఫ్‌కు కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడులు జరిగినట్లు వార్తలు వినిపించాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ప్రియుడి ముందు యువతిపై గ్యాంగ్‌రేప్