గర్భం దాల్చిన ఓ మహిళను గురువారం ఉదయం లాడ్లో కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటనలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు కూడా మరణించింది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించే ప్రయత్నంలో అత్యవసర సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు.
Bunker Buster Bomb: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల వారం రోజుల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరింది. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే తాజాగా సంధి ముగియడంతో మరోసారి యుద్ధం ప్రారంభమైంది. అయితే సంధి కాలంలో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి జరిగింది, దీని వల్లే…
Israel-Hamas: హమాస్ దాడి తర్వాత ఆ సంస్థను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని గోల్డా మీర్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన శత్రువులను చంపేందుకు ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’ లాంటి మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే హమాస్ కీలక నేతల్ని చంపేందుకు నెతన్యాహు ఇజ్రాయిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్’ని ఆదేశించారు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకత్వం…
ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొంత కాలంగా యుద్ధం కొనసాగుతుంది. అయితే, అక్టోబర్ 24న ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు ఎలాంటి దాడులు జరగలేదు.
India at UN: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానిన ఐక్యరాజ్య సమితి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలిచింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 91 దేశాల్లో భారత్ కూడా ఉంది.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి సంధి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి అరుదైన ఆహ్వానం అందింది. హమాస్ ఉగ్రసంస్థ మస్క్‌ని గాజా సందర్శించాల్సిందిగా ఆహ్వానించింది. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత గాజాను సందర్శించాలని హమాస్ సీనియర్ అధికారి మంగళవారం మస్క్‌కి ఆహ్వానం పలికారు.
Israel Hamas War : పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ గూఢచారులు పట్టుబడ్డారు. ఇక్కడి శరణార్థుల శిబిరంలో నివాసముంటున్నారు. శనివారం వారిని గుర్తించిన జనం అతడిని కాల్చి చంపారు.