US Senators: ప్రపంచవ్యాప్తంగా రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హమాస్ దేశాల మధ్య యుద్ధం బీభత్సంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం వల్ల సదరు దేశాలపై ఆర్థిక భారం పెరుగిపోతుంది. దీంతో ఉక్రెయిన్ కు యుద్ధ సహాయంతో పాటు సరిహద్దు అమలు విధానానికి కలిపి అమెరికా $ 118 బిలియన్ ప్యాకేజీని విడుదల చేసింది. అలాగే, రష్యా- ఉక్రెయిన్ మధ్య ఒకటిన్నర సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది. మరోసారి ఉక్రెయిన్‌కు సైనిక సహాయం గత కొద్ది రోజుల క్రితం అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
Read Also: Shiva Parayanam: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సుఖశాంతులతో ఉంటుంది
అయితే, అదనపు నిధుల ఆమోదం లేకుండా ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా సహాయం ఏడాది చివరి నాటికి ముగుస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఏడాది రష్యాతో జరిగే యుద్ధంలో కీవ్‌కు సహాయం చేయడానికి చివరి సహాయ ప్యాకేజీలో యూఎస్ $ 250 మిలియన్ల వరకు ఆయుధాలు, సామగ్రిని ఉక్రెయిన్‌కు అందజేస్తుందని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌కు 61 బిలియన్ డాలర్ల సాయం అందించాలని అధ్యక్షుడు జో బిడెన్ కాంగ్రెస్‌ను కోరారు. అలాగే, ఇజ్రాయెల్ కు కూడా భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.