Israel-Iran Conflict: ఇరాన్‌పైకి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోని ఒక సైట్‌పైకి ఇజ్రాయిల్ క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్ గురువారం ఆలస్యంగా ఈ విషయాన్ని నివేదించింది. ఇరాన్ నగరంలోని ఇసాఫహాన్‌లోని విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో అనేక విమానాలు ఇరాన్ గగనతలం నుంచి మళ్లించబడ్డాయని సీఎన్ఎన్ తెలిపింది.
Read Also: Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
Also Read
ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కి చెందిన ఇద్దరు కీలక జనరల్స్‌తో పాటు పలువురు ఇరాన్ అధికారులు మరణించారు. అయితే, ఈ దాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ గత శనివారం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వరకు ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే అడ్డుకుని కుప్పకూల్చాయి. గురువారం ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా తదుపరి సైనిక చర్యలకు పాల్పడకుండా ఆపాలని ఇరాన్ యూఎన్‌కి చెప్పింది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!