Israel Attack: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత శనివారం ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని ఆకాశంలోనే అడ్డుకుని నేలకూల్చాయి. ఈ దాడి తర్వాత దీనికి ప్రతీకారం తప్పకుండా ఉంటుందని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడికి ఇప్పటికే ఇజ్రాయిల్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్ ఇరాన్‌లోని షెకారీ ఆర్మీ ఎయిర్ బేస్‌పైకి మిసైళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్!
ఇరాన్ అనేక డ్రోన్లు కూల్చివేసినట్లు చెబుతోంది. తమ దేశంపై ప్రస్తుతానికి ఎలాంటి క్షిపణి దాడి జరగలేదని తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థ డ్రోన్లు కూల్చివేసినట్లు ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రతినిధి హుస్సేన్ దాలిరియన్ చెప్పారు. తమ సెంట్రల్ సిటీ ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతానికి సమీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరాన్ మీడియా శుక్రవారం పేర్కొంది. ఇరాన్ మూడు ఇజ్రాయిల్ డోన్లను కూల్చేసినట్లు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో ఫ్లై దుబాయ్ విమానం టెహ్రాన్ వెళ్లకుండా వెనక్కి వచ్చింది. ఇరాన్ లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అంతర్జాతీయ విమానాలు రద్దు చేయబడ్డాయి. దేశంలోని పలు ప్రాంతాలకు కూగా విమాన సేవల్ని నిలిపేశారు.
ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి ఆ దేశానికి చెందిన ఇద్దరు జనరల్స్‌ని చంపేసింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 13న డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. పటిష్ట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కలిగిన ఇజ్రాయిల్ వాటన్నింటిని కూల్చేసింది. ఈ దాడికి ప్రతీకారం ఉంటుందని, తమకు హాని కలిగించాలని చూసిన వారికి తాము హాని కలిగిస్తానమి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు.