Israel-Iran Conflict: ఇజ్రాయిల్‌పై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు యూదు దేశం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇరాన్‌పై దాడికి ప్లాన్‌ని ఇజ్రాయిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏ క్షణం దాడి చేస్తుందనే వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు. మరోవైపు ఇరాన్ క్షిపణి, డ్రోన్ కార్యక్రమాలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ..ఇరాన్ ప్రభుత్వం తమ హానికరమైన అస్థిరపరిచే చర్యలకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనకడాడు అని అన్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మరియు ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు మద్దతు ఇచ్చే సంస్థలపై కొత్త ఆంక్షలు విధిస్తు్నట్లు ప్రకటించారు.
Read Also: Ayodhya Ram madir: ప్రధాని మోడీ స్పూర్తితోనే ‘‘సూర్య తిలకం’’ ఆచారం: అయోధ్య ట్రస్ట్..
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేయడంతో ప్రతీకారంతో ఇజ్రాయిల్ ఎదురుచూస్తోంది. ఇరాన్‌పై దాడికి నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యొక్క వార్ క్యాబినెట్ మూడో సమావేశం బుధవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై ఆంక్షలు విధించాలని కోరుతూ, రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ని తీవ్రవాద గ్రూపుగా గుర్తించాలని కోరుతూ 32 దేశాలకు లేఖ రాశానని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. మరోవైపు కొన్ని క్షిపణులు ఇరాక్ నుంచి తమపైకి వచ్చినట్లు ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీ ఖండించారు. ఇరాక్‌ని యుద్ధంలోకి తీసుకురావడానికి మేము అనుమతించమని అన్నారు.
అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా, 240 మందిని బందీలుగా చేసుకుంది. అప్పటి నుంచి ఈ దాడి వెనక ఇరాన్ ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా తమపై దాడి చేస్తుందని ఇజ్రాయిల్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ అత్యున్నత మిలటరీ జనరల్స్ మరణించారు. వీరితో పాటు ఏడుగురు సైనికాధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయిల్‌పై ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తాజాగా ఆదివారం ఇజ్రాయిల్‌పై వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిదాడి ఉంటుందని ఇజ్రాయిల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి మధ్యప్రాచ్యం ఉద్రిక్తంగా మారింది.