గత కొంతకాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య ఆయా దేశాలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా సత్‌ఫలితాలు రాలేదు. అలాగే హమాస్ కూడా ఇజ్రాయెల్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. దీనికి కూడా సరైన సానుకూల ఫలితాలు రాలేదు. తాజాగా మరోసారి హమాస్.. ఇజ్రాయెల్ ముందు క్రొత్త ప్రతిపాదన పెట్టింది. దీనికి అంగీకరిస్తే… ఆయుధాలు విడిచిపెట్టేస్తామని సందేశం పంపించింది.
ఇది కూడా చదవండి: CSK Super Fan: ధోనీని కలవాలని ఉంది.. 103 ఏళ్ల సీఎస్కే సూపర్ అభిమాని వీడియో వైరల్
ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి ఒక కీలక ప్రతిపాదన తీసుకొచ్చారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు విడిచిపెడతామని తెలిపారు. తాజాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదే విధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరాలనుకుంటున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Madhavi latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఆస్తులెన్నో తెలుసా! ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా రికార్డ్!
హమాస్ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికీ భీకరంగా యుద్ధం సాగుతోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకుపోతుంది. కానీ విజయం సాధించలేకపోయింది. ఇంకా హమాస్ ప్రతినిధులు క్షేమంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటుందా? లేదంటే హమాస్ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా? చూడాలి. ఇక అక్టోబర్ 7 నాటి ఘటనకు బాధ్యత వహిస్తూ ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా భీకరమైన వార్ జరుగుతోంది. ఇరు దేశాలు క్షిపణులు, బాంబులు, డ్రోన్ దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: Summer : సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్ కు వెళ్తున్నారా?ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..