Israel: ఇజ్రాయిల్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై విరుచుకుపడింది. 40 టెర్రర్ టార్గెట్స్‌ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బుధవారం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని ఐతా అల్-షాబ్ చుట్టూ ఉన్న హిజ్బుల్లా సౌకర్యాలపై ఫైటర్ జెట్లతో, ఆర్టిలరీతో అటాక్ చేసినట్లు సైన్యం పేర్కొంది. ఇజ్రాయిల్‌కి ఉత్తర భాగాన లెబనాన్ నుంచి క్రమం తప్పకుండా హిజ్బుల్లా మిలిటెంట్లు రాకెట్ల దాడులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత నుంచి హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయిల్‌పై ఈ టెర్రర్ గ్రూప్ దాడులకు పాల్పడుతోంది. హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ ప్రాక్సీలుగా పనిచేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7నాటి హమాస్ దాడిలో ఇరాన్ వారికి సహకరించిందని ఇజ్రాయిల్ చెబుతోంది.
Read Also: BJP MP: గుండెపోటుతో బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ దిలేర్ మృతి..
ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ ఫైటర్ జెట్లు సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఇరానియన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్‌తో సహా 8 మందిని హతమార్చింది. ఈ నేపథ్యంలోనే గత వారం ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లలో విరుచుకుపడింది. వీటిని ఆకాశం లోనే ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుని కూల్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు పాల్పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.