Restrictions On Media: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాతో యుద్ధంలో పాల్గొంటున్న తమ సైనికులు విచారణను ఎదుర్కొనే ఛాన్స్ ఉండటంతో.. మీడియాపై ఆంక్షలు పెట్టింది. ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన ఓ రిజర్వ్ సైనికుడు బ్రెజిల్‌లో పర్యటించాడు. కొందరు పాలస్తీనా అనుూలవాదులు అతడిని గుర్తు పట్టి కంప్లైంట్ చేశారు దీంతో అతడిని విచారించాలని ఫెడరల్ పోలీసులను బ్రెజిల్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ఆ సైనికుడికి తెలియడంతో బ్రెజిల్ దేశాన్ని విడిచిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై తమ సైనికుల పేర్లు, ముఖాలను పూర్తిగా చూపించకూడదని ఇజ్రాయెల్ మీడియాకు ఆదేశాలు వెళ్లాయి. కల్నల్ అంతకంటే తక్కువ స్థాయి సైనిక అధికారులకు ఈ నిబంధన వర్తిస్తోందని వెల్లడించారు. పైలెట్‌లు, ఇతర విభాగ దళాలకు ఇప్పటికే పలు రూల్స్ అమలు చేస్తున్నారు.
Read Also: Om Birla: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..
ఇక, మా సైనికుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ వ్యతిరేక వర్గాలు చేస్తున్న ఘటనలతో వారిని రక్షించేందుకు ఈ నిబంనలు ఉపయోగపడతాయని టెల్‌అవీవ్ సైనికాధికార ప్రతినిధి నదవ్ శోషానీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గ్యాలంట్‌పై ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.