ఎట్టకేలకు బాంబు శబ్ధాలకు గాజాలో పుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా రాకెట్ దాడులు చేసింది. దీంతో ఆస్తుల ధ్వంసంతో పాటు వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఇప్పటికే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో లెబనాన్‌లో ప్రశాంతత నెలకొంది. తాజాగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య కూడా చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Immunity Boosting Asanas: ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు.. రోజూ సాధన చేస్తే ఆరోగ్యం పదిలం!
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఒప్పందానికి అత్యంత చేరువలో ఉన్నట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ సైతం తెలిపింది. చర్చల్లో పురోగతి ఉందని, సంబంధిత అంశాలు ఖరారు దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. తుది ఆమోదం కోసం సంబంధిత ప్రణాళికను ఇజ్రాయెల్ కేబినెట్‌కు సమర్పించాల్సి ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Double Murder: జంట హత్యల కేసుపై పోలీసులు సంచలన విషయాలు..
అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అదే ఏడాది నవంబర్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మందిని విడిచిపెట్టారు. ఇంకా దాదాపు 100 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో మూడోవంతు మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధానికి తెరదించేలా ఇరుపక్షాల నడుమ శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతర్‌లు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చర్చల పరిస్థితుల్లో ప్రస్తుతం ఆకస్మిక మార్పు వచ్చిందని.. స్పష్టమైన ఒప్పంద ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చిందని అధికారులు తెలిపారు.
చర్చలు తుది దశకు చేరుకున్నట్లు హమాస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తన పదవీ కాలం పూర్తయ్యేలోగా గాజా యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా తాను అధికార బాధ్యతలు చేపట్టేలోగా బందీలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ కూడా హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చర్చలు కొలిక్కి వచ్చినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనం… అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు