అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.
పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగానే.. తాజాగా ఇరాన్ చేరింది. ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది.
Israel attack on Iran : దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ వేగంగా క్షిపణులను ప్రయోగించింది.
శనివారం అర్ధరాత్రి ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయెల్‌పై వేగవంతమైన వైమానిక దాడులను ప్రారంభించినప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్ 300 కంటే ఎక్కువ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా దాదాపు అన్నింటినీ నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.