Breaking News: గాజా కాల్పుల విరమణకు కొత్త పరీక్షకు ఎదురైంది. తక్షణ, శక్తివంతమైన దాడులకు నెతన్యాహూ ఆదేశాలు ఇచ్చారు. హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన తర్వాత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం గాజా ప్రాంతంలో బలవంతమైన దాడులకు ఆదేశించారు.
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు నిరాశే ఎదురైంది. ట్రంప్‌ను కాదని వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు కొరినో మచాడోను ‘‘నోబెల్ శాంతి బహుమతి 2025’’ వరించింది. ఆమెకు నోబెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
Israel Hamas: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశ ముగింపుకు వస్తోంది. అయితే, ఈ దశలో చివరి షెడ్యూల్‌లో భాగంగా శనివారం ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. మొత్తం మీద ఈ దశలో 33 మంది ఇజ్రాయిలీలను హమాస్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు థాయ్‌లాండ్ బందీలు కూడా ఉన్నారు.
Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా…
Gaza Truce Deal: ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరుగుతున్న ‘‘గాజా యుద్ధానికి’’ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో ఇరు వర్గాల మధ్య యుద్ధవిరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొలి విడతలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయిలీలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Israel Hamas War : ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ చేయలేని పని గాజాలో 10 నెలల చిన్నారి చేసింది. దాదాపు 11 నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని మూడు రోజుల పాటు ఆపేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో గాజా స్ట్రిప్ లో ఆరోగ్య సామాగ్రి, ఇంధనం యొక్క సురక్షితమైన రవాణాను సులభతరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ మానవతా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది