Israel: ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తమపై దాడి చేసే వారిని వదిలేది లేదని చాలా సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. అతడి మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.