హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్‌ను పూర్తిగా నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో మైనారిటీ వ్యతిరేకత, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పనిగట్టుకుని హిందువుల వ్యాపారాలు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వరదలు సంభవిస్తే, అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఇస్కాన్ సంస్థనే ఇప్పుడు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆన్‌లైన్ క్యాంపెయినింగ్ నడుస్తోంది.
ISKCON Temples Hyderabad: కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు. పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్. ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి. నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా…
Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్) బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపింది. ఇటీవల ఆమె ఇస్కాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై పూర్తి నిరాధార ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారని ఇస్కాన్ పేర్కొంది. ఇస్కాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తాము న్యాయం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.