Iskcon: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అయితే, ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇది కచ్చితంగా ఆ పూరీ జగన్నాథుడి కృపే.. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించాగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరగటం.. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్‌యార్డ్‌ను ఇచ్చి సహకరించారని వెల్లడించారు.
Read Also: Danger Stunt At Mumbai: ముంబైలో యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. ఆగ్రహించిన నెటిజన్స్..
కాగా, పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. తృటిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకోవడంతో.. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. గాయపడిన ట్రంప్ చుట్టూ వెంటనే భద్రతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ను అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి తరలించగా, అదే సమయంలో మరి కొందరు దుండగుడిపై కాల్పులు జరిపి చంపేశారు.
Read Also: Gun Fire : తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి సహా ఏడుగురు మృతి
ఇక, ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర జులై 7వ తేదీన వైభవోపేతంగా ప్రారంభమై.. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర..ఈ ముగ్గురు మూర్తులు రథాలపై పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. నేడు తిరుగు రథయాత్ర కొనసాగుతుంది. ఈ వేడుకను బహుడా యాత్రగా పిలుస్తారు. ఈ ఉత్సవంలో 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. రథయాత్ర మాదిరిగా బహుడా వేడుకకు పూరీలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పొహండి, రథాలు లాగే సమయంలో ప్రత్యేక బలగాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.