ISKCON Temples Hyderabad: కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు. పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్. ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి. నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా వైధాంధిక భక్తి సంస్థ ఇస్కాన్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ISKCON). తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం. కృష్ణుడి గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడు చెప్పిన విధానంలో నడుచుకుంటూ ఉంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు కృష్ణ తత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి ఈ సంస్థ సేవలు చేస్తోంది.
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో అబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ మందిరము 1976లో స్థాపించబడింది. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాద వారిచే భారతదేశంలో నాలుగు ఇస్కాన్ మందిరాలు స్థాపించబడ్డాయి ఇందులో మొదటిది 1975లో ఉత్తరప్రదేశ్లోని వృందావనంలో స్థాపించబడింది. రెండవది హైదరాబాద్ నగరంలోని ఇస్కాన్ టెంపుల్. మూడోది ముంబై నగరంలోని జుహు ప్రాంతంలో ఉంది. నాలుగో ఆలయము పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్లో ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో మొత్తం మూడు ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదులోని అబిడ్స్, సికింద్రాబాద్, తాజాగా అత్తాపూర్ లో కూడా ఇస్కాన్ ను నిర్మించారు.