హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు.
ISKCON: లండన్ లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రసిద్ధ శాఖాహార సంస్థగా పేరున్న ఈ రెస్టారెంట్‌లోకి ఆఫ్రికా సంతతికి చెందిన ఒక బ్రిటిష్ వ్యక్తి మాంసం తీసుకువచ్చి తిన్నాడు. కావాలని కేఎఫ్‌సీ చికెన్ తీసుకువచ్చి రెస్టారెంట్‌లో గలాటా చేశాడు. రెస్టారెంట్‌లో కేవలం శాఖాహారం మాత్రమే వడ్డిస్తారని తెలియగానే, కావాలనే తన చేతిలో ఉన్న బకెట్ నుంచి చికెన్ ముక్కలు తీసి తినడం ప్రారంభించారు. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తులు ఎంత వారిస్తున్నా, వినకుండా అక్కడ…
Adani : ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళా 2025లో భక్తులకు ఆహారాన్ని అందించడానికి అదానీ గ్రూప్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) చేతులు కలిపాయి.
Chinmoy Krishna Das: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు గాను 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా…
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆడగం లేదు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరుపున వాదించే లాయర్లను కూడా అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ బెదిరిస్తు్న్నారు.
Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అణిచివేతను పట్టించుకోవడం లేదు.
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో హిందువులు, మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని బంగ్లాదేశ్‌ని కోరింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై రేపు (నవంబర్ 29) జైశంకర్ పార్లమెంట్‌లో వివరించనున్నారు.