Ishan Kishan is Sourav Ganguly choice as India keeper for World Cup 2023: ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిడిల్ ఆర్డర్, కీపర్ స్థానాలపై సందిగ్థత నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడుతారని ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. రిషబ్ పంత్ గాయపడడంతో.. ప్రపంచకప్ 2023లో ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. సీనియర్లు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌తో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రేసులో ఉన్నాడు. ఏ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సంజూ శాంసన్ గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో అతడికి వన్డే ప్రపంచకప్ 2023లో చోటు దక్కడం కష్టమే. కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను బ్యాకప్‌గా తీసుకుంటారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయం వెల్లడించారు. ‘రిషబ్ పంత్ అత్యుత్తమ కీపర్. ఇషాన్ కిషన్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా నాణ్యమైన ప్లేయర్స్. అయితే రాహుల్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్, ఇషాన్ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మదిలో ఉంటారు. నేను ఇషాన్ వైపే మొగ్గు చూపుతా’ అని దాదా అన్నారు.
Also Read: Vivo T1X Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డిస్కౌంట్.. రూ.12999కే వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్!
‘ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. అందుకే ఇషాన్‌ను రాహుల్ ద్రవిడ్ తన ప్రణాళికల్లో ఉండేలా చూసుకోవాలి. వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టులో సీనియర్లతో పాటు యువకులు ఉండేలా ఎంపిక చేయాలి. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లు ఏ భయం లేకుండా ఆడేస్తారు. ఇప్పుడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. మెగా టోర్నీ కోసం సరైన జట్టును ఎంపిక చేయాలి’ అని సౌరవ్ గంగూలీ సూచించారు.