ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము.…
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు – ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని బహిష్కృత క్రౌన్ ప్రిన్స్ రెజా షా పహ్లవి ఆరోపించారు. సుప్రీం నాయకుడు ఖమేనీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడిపై స్పందిస్తూ, రెజా షా పహ్లవి Xలో ఇలా రాసుకొచ్చారు.. “ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాల కోసం చేసిన వినాశకరమైన ప్రయత్నం ఫలితంగా…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు.
Earthquake: ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్లో మరోసారి భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని బెంజెమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగబోతుందంటూ వార్తలు వచ్చాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్‌లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగా రెండోసారి తన కుమారుడి పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇది వ్యక్తిగత నష్టంగా అభివర్ణించారు
Israel: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెడున్నాయి. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య సంఘర్షణ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలను, ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, కీలక మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ దాడులు చేసింది. మరోవైపు, ఇరాన్ కూడా క్షిపణులతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతోంది.
Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
ఇరాన్‌పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.