Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
ఇరాన్‌పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. క్షిపణుల ప్రయోగాలతో ఇరు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగర నివాసితులంతా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇరాన్ పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని, ఈ సందర్భంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు. ట్రంప్ సమావేశానికి ముందు, ఇరాన్ సుప్రీం…
Mohsen Fakhrizadeh: ఇజ్రాయిల్ ఆపరేషన్ ఎలా ఉంటాయో చూడాలంటే, తాజాగా ఇరాన్ దాడులే నిదర్శనం. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని వారి బెడ్రూంలోకి దూరి మరీ చంపేస్తోంది. వీరిలో పాటు కీలకమైన మిలిటరీ జనరల్స్‌ని అత్యంత ఖచ్చితత్వంతో హతమార్చింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది.
మొహసిన్ ఫక్రిజాదే.. ఇరాన్ అణు పితామహుడు. ఇరాన్ అణు ఆశయాల వెనుక ఉన్నది ఇతడే. కానీ ఇతన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎలా లక్ష్యంగా చేసుకుందో.. ఏమో తెలియదు గానీ.. అత్యంత రహస్యంగా టెహ్రాన్‌లో 2020లో గురి చేసి కాల్చి చంపేసింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఇలా ఇరు పక్షాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. బుధవారం జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది ఇరానీయులు చనిపోయినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.