Israel Iran Conflict: ఇటీవల ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇరాన్ అణు కార్యక్రమాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అణు ఫెసిలిటీలపై దాడులతో పాటు అణు శాస్త్రవేత్తలను, సైనిక కమాండర్లను హతమార్చింది. దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఉన్న 60 మందిని టార్గెటెడ్ దాడుల్లో చంపేసింది. అయితే, శనివారం ఇరాన్ ప్రభుత్వ లాంఛనాలతో వీరికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ రాజధాని టెహ్రాన్‌లో వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేసి పెద్ద సంఖ్యలో ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇరాన్ అధ్యక్షుడ మసౌద్ పెజెష్కియాన్‌తో పాటు ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
టెహ్రాన్‌లో అమరవీరుల గౌరవార్థం కార్యక్రమం నిర్వహించిన తర్వాత 11 కి.మీ దూరంలోని ఆజాది స్వ్కేర్ వరకు అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. టెహ్రాన్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మొహ్సేన్ మహమూది మాట్లాడుతూ.. ఇది ఇస్లామిక్ ఇరాన్, విప్లవానికి చారిత్రాత్మక రోజు అని చెప్పారు. మృతుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మేజర్ జనరల్, ఇరాన్ సైన్యానికి రెండో కమాండర్‌గా ఉన్న మొహమ్మద్ బాఘేరీ ఉన్నారు. బాఘేరితో పాటు ఆయన భార్య, కుమార్తెలను ఆయనతో పాటే ఖననం చేస్తారు.
ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన అణు శాస్త్రవేత్త మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చిని కూడా అతడి భార్యతో పాటు ఖననం చేయనున్నారు. ఘర్షణ మొదటి రోజు మరణించిన రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీని కూడా శనివారం వేడగల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. మొత్తం 30 మంది ఇతర అగ్ర కమాండర్లను కూడా ఇరాన్ ప్రభుత్వం గౌరవార్థం కార్యక్రమం నిర్వహిస్తుంది.