గోవాలో జరిగిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.…
ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తన కెప్టెన్‌ను వదిలేసేందుకు సిద్దమైందట. ఐపీఎల్ 2024…
2025లో ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ నవంబర్ చివరలో మెగా వేలం నిర్వహిచే అవకాశాలు ఉన్నాయి. మెగా ఆక్షన్‌కు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఇటీవల బీసీసీఐ విడుదల చేసింది. గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఓ ప్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. అక్టోబర్ 31 లోగా అన్ని ఫ్రాంఛైజీలు రిటైన్ లిస్టు సమర్పించాల్సి ఉంటుంది. క్రికెట్ అభిమానులంతా ఈ లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్. ఇందుకు కారణం.. టీమిండియా…
Rohit Sharma React To Fan Question, Which IPL Team To Play: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 344/3 స్కోరు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకంజలో ఉంది. లంచ్ బ్రేక్‌కు ముందు వర్షం…
Dale Steyn departure from Sunrisers Hyderabad: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక ప్రకటన చేశాడు. బౌలింగ్ కోచ్‌గా తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)ను వీడుతున్నట్లు తెలిపాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మాత్రం బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతానని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన స్టెయిన్.. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు.…
Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రతీ ప్రాంచైజీకి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఒకరైనా అన్‌క్యాప్డ్ ప్లేయర్ (జాతీయ జట్టుకు ఆడని ఆటగాడు) ఉండాలి. విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి రూ.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి తమకు నచ్చిన…
Sunrisers Hyderabad Retain List for IPL 2025: ఐపీఎల్ 2025 ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది?…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. దీంతో ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వేలంలోకి వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అందరి కళ్లు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హిట్‌మ్యాన్ తన పేరును నమోదు చేసుకుంటాడని…
Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్‌గా తొలగించి.. హార్దిక్ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ జట్టుని వీడతాడనే…