IPL 2025: సారీ.. ఎస్ఆర్‌హెచ్‌ను వదిలేస్తున్నా: డేల్ స్టెయిన్
- మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం
- డేల్ స్టెయిన్ కీలక ప్రకటన
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు అంటూ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dale Steyn departure from Sunrisers Hyderabad: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కీలక ప్రకటన చేశాడు. బౌలింగ్ కోచ్‌గా తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)ను వీడుతున్నట్లు తెలిపాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మాత్రం బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతానని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన స్టెయిన్.. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు.
‘క్రికెట్ అనౌన్స్‌మెంట్.. గత కొన్నేళ్లుగా బౌలింగ్ కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2025లో ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి పనిచేయలేకపోతున్నా. కానీ సౌతాఫ్రికా 20 లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో పనిచేస్తా. ఎస్‌ఏ 20 లీగ్‌లో మేం హ్యాట్రిక్ కొడతాం అన్న నమ్మకం ఉంది’ అని డేల్ స్టెయిన్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. కోచ్‌గానే కాకుండా సన్‌రైజర్స్ జట్టుకూ స్టెయిన్ ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ విజేతగా నిలవడంతో, 2018లో ఫైనల్స్‌కు వెళ్లడంలో అతడిది కీలక పాత్ర.
Also Read
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
Also Read: IND vs NZ: 46 పరుగులకే ఆలౌట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు!
ఐపీఎల్ 2024లో డేల్ స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాక్లిన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా తప్పుకోవడంతో.. ఫ్రాక్లిన్‌కే పూర్తిస్థాయి పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది.
Cricket announcement.
A big thank you to Sunrisers Hyderabad for my few years with them as bowling coach at the IPL, unfortunately, I won’t be returning for IPL 2025.
However, I will continue to work with Sunrisers Eastern Cape in the SA20 here in South Africa. 🇿🇦Two time…
— Dale Steyn (@DaleSteyn62) October 16, 2024
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..