ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 బజ్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. కాగా ఈనెల ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. భారత స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఉమ్రాన్ స్థానంలో భారత ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను కేకేఆర్ మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుతో కోల్‌కతా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఈ మ్యాచ్…
IPL 2025: ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ…
IPL Purple Cap Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ అంటేనే బ్యాట్స్మెన్ హవా కొనసాగుతుంది. బంతి బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నించే ఈ టి20 ఫార్మేట్ లో బ్యాట్స్మెన్ దూకుడుకి కళ్లెం వేసి వికెట్లను సాధించడం అంత ఆషామాసి విషయం కాదు. కాబట్టి, ప్రతి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఐపీఎల్ పర్పుల్…
Orange Cap Holders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ను ఆరెంజ్ క్యాప్ తో గౌరవిస్తుంది. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం ఓ బ్యాట్స్‌మన్‌కి తన కెరియర్లో మరింత ముందుకు వేలెందుకు ఎంతగానో సహాయపడుతుంది. గత 17 సంవత్సరాల్లో ఈ జాబితాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. ప్రత్యేకంగా, విరాట్ కోహ్లీ 2016లో 973 పరుగులు చేసి ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డు కైవసం చేసుకున్నాడు.…
IPL 2025 Captains: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఇప్పుడు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమైపోయాయి. ఇక ఐపీఎల్ మెగా వేలం తర్వాత అన్ని టీమ్స్ కొత్తగా కన్పడుతున్నాయి. అంతేకాదు కొన్ని జట్లకు సంబంధించి కెప్టెన్ల జాబితా కూడా మారింది. ఈసారి ఐపీఎల్ 2025లో పాల్గొనే 10 జట్లలో ఏకంగా 9 జట్లకు భారతీయులు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండగా.. ఒక్క ఎస్ఆర్హెచ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్…
‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకితభావానికి మారు పేరు ద్రవిడ్. ఆటగాడిగా భారత జట్టు తరఫున ఇది ఎన్నోసార్లు నిరూపించాడు. ఇప్పుడు కోచ్‌గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్.. గురువారం చేతి కర్రల సాయంతో టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గాయమైన కాలికి స్పెషల్ బూట్ వేసుకుని.. కర్రల సాయంతో నడుచుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను…
అందరూ ఊహించిందే నిజమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అక్షర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తన ఎక్స్ ద్వారా తెలిపింది. ‘ఈరోజు కొత్త శకం ప్రారంభమంది’ అని పేర్కొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. సారథ్యం తీసుకొనేందుకు అతడు మొగ్గు చూపలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిపోయిన విషయం…
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్‌పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్ 2027లో మరలా ఐపీఎల్లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్…