RCB Unbox Event 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ 18వ ఎడిషన్ గా జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది. ప్రతి సారి లాగా ఈ సారి కూడా ఐపీఎల్ లోని అన్ని జట్లు తమ జట్లను మెరుగుపరుచుకోవడానికి, కొత్త క్రీడాకారులను తీసుకోని కప్ గెలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే తన ప్రతిష్టాత్మక అనబాక్స్ ఈవెంట్ ను ప్రకటించింది. ఈ కార్యక్రమం మార్చి 17, 2025 న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రతి ఏడాది ఈ ఈవెంట్‌లో జట్టు తన కొత్త జెర్సీని విడుదల చేస్తుంది. అలాగే కొత్త కెప్టెన్‌ను అభిమానుల ముందుకు తీసుకొస్తుంది.
Read Also: BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!
ఈ సారి RCB జట్టు కొత్త కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను నియమించింది. ఈ అనబాక్స్ ఈవెంట్‌లో ఆయన అధికారికంగా అభిమానుల ముందుకు రానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తమ ఫేవరెట్ జట్టు, క్రీడాకారులతో కలవడానికి అవకాశం లభిస్తుంది. ఈ ఈవెంట్ RCB అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈ అనబాక్స్ ఈవెంట్ RCB జట్టు ప్రియులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనుంది. ఆటగాళ్లతో సన్నిహితంగా కలిసే అవకాశం, కొత్త జెర్సీని ప్రత్యక్షంగా చూడటం వంటి అనేక ప్రత్యేక ఘట్టాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. రజత్ పాటీదార్ కొత్త కెప్టెన్‌గా విజయం సాధించి, జట్టును విజయపథంలో నడిపిస్తాడని RCB అభిమానులు ఆశిస్తున్నారు.
The #RCBUnbox is back, bigger, better and bolder! 💥
Mark your calendars, March 17 2025 it is. 📅
📍 M Chinnaswamy StadiumStay tuned for the event line up. 🎺🎶🏏 pic.twitter.com/WZ5TjOmc4I
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 3, 2025
RCB జట్టు ఎన్నో సీజన్‌లలో బాగా ఆడినా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. కానీ ఈ సారి కొత్త కెప్టెన్, కొత్త దృక్పథంతో జట్టు ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈవెంట్ తర్వాత RCB జట్టు తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించనుంది. మొత్తానికి, RCB అనబాక్స్ ఈవెంట్ RCB అభిమానులకు కిక్కు ఇచ్చే కార్యక్రమంగా ఉండనుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటుందేమో చూడాలి.