IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్
- మొదలైన ఐపీఎల్ 2025 సందడి..
- చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్ ఎమ్ఎస్ ధోని.
- స్వాగతం పలికిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. “కూల్ కెప్టెన్” గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోనీ బౌలర్లను సమర్థంగా మేనేజ్ చేయడంలోనూ, కీలక సమయాల్లో మ్యాచ్ ను మార్చే సత్తా కలిగిన ఆటగాడిగా ఉండటంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. క్రికెట్ లో అతని తెలివితేటలు, స్టంపింగ్ స్పీడ్, ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ ఉండగానే.. ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం మహీ మళ్లీ సిద్ధమవుతున్నాడు.
Read Also: Chitti Fraud: చిట్టిల పేరుతో కుచ్చుటోపి.. ఏకంగా 500 మందిని మోసం చేసిన పుల్లయ్య..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ధోనీ ఐపీఎల్ 2025 కోసం సన్నద్ధమయ్యాడు. తాజాగా అతడు సీఎస్కే హోం టౌన్ చెన్నైకి చేరుకున్నాడు. దీంతో అతడికి చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం అందించారు. సీఎస్కే అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ధోనీ చెన్నై చేరుకున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో, కళ్లజోడు పెట్టుకుని ఎంతో కూల్ గా నడుస్తున్న మహీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహీ తన సింప్లిసిటీతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు త్వరలోనే ఐపీఎల్ కోసం ట్రైనింగ్ క్యాంప్ ను ప్రారంభించనుంది. ఇందులో పాల్గొనేందుకు ధోనీ చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు మరోకొంత మంది ఆటగాళ్లు కూడా ఈ క్యాంప్ లో ప్రాక్టీస్ చేయనున్నారు. చెన్నైకు చేరుకున్న ధోనీకి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వాగతం పలికాడు. ఇద్దరూ కౌగిలించుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. ధోనీ తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతాడన్న నమ్మకంతో సీఎస్కే అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
Read Also: KTR: రేవంత్‌రెడ్డి ధన దాహం వల్లే.. ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు!
2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది. ఈ సారి ధోనీ కేవలం మెంటార్ రోల్ లో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ లో ఐదు ట్రోఫీలను గెలుచుకున్న సీఎస్కే, ఈసారి కూడా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ధోనీ ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాట్లను తయారు చేయించుకున్నాడు. ధోనీ ఐపీఎల్ ను వీడినా, సీఎస్కే అభిమానుల మనసుల్లో అతను ఎప్పటికీ అలా నిలిచిపోతాడు. అతని నాయకత్వంలో జట్టు విజయాలను సొంతం చేసుకున్న తీరును చూసి ఇప్పటికీ కొత్త ఆటగాళ్లు స్పూర్తి పొందుతున్నారు. ఇక ధోనీ 2025 సీజన్ లో ఎంతవరకు తన మేజిక్ కొనసాగిస్తాడో చూడాలి. సీఎస్కే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే మళ్లీ “ధోనీ.. ధోనీ” అంటూ స్టేడియంని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.
MS DHONI MEETS RUTURAJ GAIKWAD IN CHENNAI. ❤️pic.twitter.com/wo6cghIGPM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!