మైదానంలో క్లిష్ట సమయాల్లో ఎలా ఉండాలో తన మెంటార్ ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకొన్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మన చేతుల్లో లేనివాటి గురించి ఆలోచించడం అనవసరమన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం సంతోషం కలిగించిందన్నాడు. శార్దూల్ ఠాకూర్ అద్భుతం అని పంత్ ప్రశంసించాడు. గురువారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్…
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్‌ను చెన్నై, ఆర్సీబీలు విజయాలతో ఆరంభించాయి. కోల్‌కతాపై బెంగళూరు, ముంబైపై చెన్నై గెలిచాయి. అదే జోరు కొనసాగించాలని రెండు జట్లూ చూస్తున్నాయి. అయితే చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొట్టేనా? అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందుకు కారణం చెపాక్ గణాంకాలే. ఐపీఎల్ మొదలై…
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యా్న్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్నో 193 పరుగులు చేసి గెలుపొందింది.
Shardul Thakur: నేడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ఇక మ్యాచ్ లో భాగంగా లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగలిగింది. ఇందులో చివరి మ్యాచ్లో సెంచరీ హీరో ఈసారి మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు ఇషాన్…
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లక్నో ముందు 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ కుడిచేతి ఆల్ రౌండర్. ఇప్పటివరకు అతను ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రవేశపెట్టిన తర్వాత.. 22 మ్యాచ్‌లలో అతనికి కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. 59 శాతం మ్యాచ్‌లలో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.
Ambati Rayudu: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్ల హోరు, బౌలర్ల జోరుతో సీజన్ ఆదినుంచే మొదలయ్యింది. ఇక ఆర్ఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మరో మరు ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. గ్రౌండ్ లో ఇలా ఉండగా.. ఆటగాళ్ల గురించి, మ్యాచుల గురించి మ్యాచ్ చూస్తున్న అభిమానులకు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు తమ విశ్లేషలను అందిస్తూ…
Ishan Kishan: నేడు ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనిల్ చౌదరి షేర్ చేశారు. అందులో ఆయనతో ఇషాన్ కిషన్ జరిపిన…
ఐపీఎల్ 18వ సీజన్లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్లో భారీ విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోసారి భారీ స్కోరుతో విరుచుకుపడాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన లక్నో.. ఐపీఎల్ 2025లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తరం పోరు ఖాయంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్…
RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఎదురుదెబ్బ తిన్నది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ నుంచి పెద్ద స్కోర్ రావకపోవడం రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బతీసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 పరుగులతో తేలికపాటి…