ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్నో 193 పరుగులు చేసి గెలుపొందింది. గతేడాది ప్రతీకారాన్ని ఈ మ్యాచ్‌లో తీర్చుకుంది లక్నో జట్టు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లను పూరన్ ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ మిచెల్ మార్ష్ కూడా చెలరేగాడు. 31 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (15), అబ్దుల్ సమద్ (22), డేవిడ్ మిల్లర్ (13) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలింగ్‌లో కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, జంపా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
Read also: Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత పరుగుల రాణించలేకపోయారు. మొదటి మ్యాచ్‌తో పోల్చితే ఈ స్కోరు చాలా తక్కువ. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పై ఆశలు పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32), అనికేత్ వర్మ (36), క్లాసెన్ (26), కమిన్స్ (18), హర్షల్ పటేల్ (11) పరుగులు చేశారు. మరోవైపు.. లక్నో జట్టు అద్భుత బౌలింగ్ చేసింది. శార్దుల్ ఠాకూర్ కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.