Shardul Thakur: నేడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ఇక మ్యాచ్ లో భాగంగా లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగలిగింది. ఇందులో చివరి మ్యాచ్లో సెంచరీ హీరో ఈసారి మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు ఇషాన్ కిషన్. ఓపెనర్లు అభిషేక్ శర్మ 6 బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి వెనుతిరిగాడు . ఆ తర్వాత వైజాగ్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అంకిత్ వర్మలు చెప్పుకోదగ్గ స్కోర్ చేయడంతో ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది.
Read Also: Kathua Encounter: కథువాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ మెగా వేలంలో శార్దూల్ ఠాగూర్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే, అదృష్టం కొద్ది లక్నో జట్టులో బౌలర్లు గాయాల పాలవడంతో అతడికి జట్టు నుండి పిలుపు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శార్దూల్ ఠాకూర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుకి అడ్డుకట్ట వేశాడు. ఠాకూర్ నేడు జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశాడు. ఈ దెబ్బతో అతడు ప్రస్తుతం సీజన్ లో నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. లక్నో ఆడిన మొదటి మ్యాచ్లో రెండు టికెట్లు తీసిన అతడు నేడు నాలుగు వికెట్లు తీయడంతో మొత్తం రెండు మ్యాచ్ లలో 6 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ లిస్టులో మొదటి స్థానానికి చేరుకున్నాడు.
SHARDUL STRIKES! 🔥
The dangerous #AbhishekSharma falls into the trap as he gets caught at fine leg off #ShardulThakur’s clever delivery!
Watch LIVE action: https://t.co/f9h0ie1eiG #IPLonJioStar 👉 #SRHvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/hx4H3wO2EN
— Star Sports (@StarSportsIndia) March 27, 2025