సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం పాటను సైతం దగ్గరుండి చూసుకునే కావ్యా పాప.. ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు. ప్లేయర్స్ ఫోర్లు, సిక్సులు బాదినప్పుడల్లా తనదైన శైలిలో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ వికెట్స్ కోల్పోయినప్పుడు డీలా పడిపోతారు. కావ్యా ఎక్స్‌ప్రెషన్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరోసారి అదే రుజువైంది.
గురువారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5×4, 3×6), అనికేత్ వర్మ (36; 13 బంతుల్లో 5×6) రాణించారు. లక్ష్యాన్ని లక్నో 16.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నికోలస్ పూరన్ (70; 26 బంతుల్లో 6×4, 6×6) పెను విధ్వంసం సృష్టించగా.. మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7×4, 2×6) మెరుపులు మెరిపించాడు. పూరన్, మార్ష్ జోడి సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు షాకిచ్చింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ సమయమంలో చిరునవ్వులు, కేకలతో అలరించిన కావ్యా మారన్.. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ బ్యాటింగ్ సమయంలో మాత్రం నిరాశకు గురయ్యారు. కావ్యా పాప ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. కావ్యాకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘బాలీవుడ్ హీరోయిన్స్ కంటే.. కావ్యా మారన్ ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందే’, ‘కావ్యా మారన్ సో క్యూట్’, ‘కావ్యా మారన్ ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️
Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025
“Kavya Maran” is very beautiful ❤️😍#KavyaMaran pic.twitter.com/LwnZ2CUZxL
— Urmila (@Urmila_95) March 27, 2025