ఐపీఎల్ 18వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోసారి భారీ స్కోరుతో విరుచుకుపడాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఐపీఎల్ 2025లో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తరం పోరు ఖాయంగా కనిపిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లోనే 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి మరోసారి పరుగుల వరద పారించాలని భావిస్తోంది. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించారు. వీరందరూ మరోసారి చెలరేగితే.. 300 స్కోర్ ఖాయమే. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీలతో పేస్ విభాగం బలంగానే ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జంపా ఆడే అవకాశాలు ఉన్నాయి.
లక్నో బ్యాటింగ్ విభాగం బాగానే ఉంది. ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా షెహ్‌బాజ్ అహ్మద్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ ఆవేశ్ ఖాన్ అందుబాటులోకి వచ్చాడు. ప్రిన్స్ యాదవ్ స్థానంలో అతడు ఆడనున్నాడు. ఇటీవల బాగా బౌలింగ్ చేస్తున్న ఆవేశ్.. ఆరంభంలోనే కట్టడి చేస్తే సన్‌రైజర్స్ భారీ స్కోరుకు అడ్డుకట్టపడుతుంది. శార్దూల్ ఠాకూర్ కొనసాగనున్నాడు. మణిమరన్ సిద్దార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్, మహమ్మద్ షమీ.
లక్నో: ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షెహ్‌బాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రతి/మణిమరన్ సిద్దార్థ్.