ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌ను విజయాలతో ఆరంబించిన సీఎస్‌కే, ఆర్‌సీబీలు.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాయి. చెపాక్‌లో ఆర్‌సీబీపై ఘనమైన రికార్డు ఉన్న సీఎస్‌కేనే ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఓవైపు ఎంఎస్ ధోనీ, మరోవైపు విరాట్ కోహ్లీలు ఆడుతుండడంతో ఫాన్స్ ఈ మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగళూరు బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ ఆర్‌సీబీ జట్టుకు చెన్నైలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. గురువారం ఆర్‌సీబీ జట్టు సహా సహాయక సిబ్బంది మొత్తం డీకే నివాసంకు వెళ్లింది. డీకే తన నివాసంలోని లాన్‌లో ఆహారం, పానీయాలతో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఆర్‌సీబీ ప్లేయర్స్ కొందరు స్విమింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియోను డీకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీ తరఫున ఆడిన దినేష్ కార్తీక్.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ అనంతరం ఆర్‌సీబీకే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో డీకే ఒకరు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో డీకే రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ కెరీర్‌లో 257 మ్యాచ్‌లు ఆడిన డీకే 4842 పరుగులు చేశారు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశారు.