న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంటే అందరికీ సుపరిచితమే.. తన కూల్ నెస్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకున్నాడు. అయితే, ప్రస్తుతానికి కేన్ మామ.. క్రికెట్ మైదానంలో కాకుండా, మరో విధంగా అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో అతను ఆడటం లేదు.. అయితే ఐపీఎల్ ప్రేక్షకుల కోసం అతను తనదైన శైలిలో సంతోషపరుస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇటీవల తమ సోషల్ మీడియా పేజీలో కేన్ విలియమ్సన్ హిందీ నేర్చుకునే వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రారంభంలో విలియమ్సన్ “హాయ్, నేను కేన్ మామా” అని తనను తాను పరిచయం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో విలియమ్సన్ హిందీ పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తీరు.. హర్భజన్ అతనితో సరదాగా ముచ్చటించే తీరు చూడముచ్చటగా ఉంది.
Read Also: Interesting Moment : స్పీకర్ గడ్డం Vs మంత్రి పొన్నం.. కరాటే ఛాంపియన్‌షిప్‌లో అసక్తికర సన్నివేశం..
ఈ సరదా సంభాషణలో హర్భజన్ సింగ్ విలియమ్సన్‌ను పరీక్షించేందుకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. “సెంచరీ అంటే ఏమిటి?” అని అడిగాడు. ఈ ప్రశ్న విన్న విలియమ్సన్ కాస్త గందరగోళానికి గురయ్యాడు. ఆ ప్రశ్నను విలియమ్సన్ అర్థం చేసుకోలేకపోయాడు. తర్వాత.. భజ్జీ “మీ దగ్గర ఎన్ని (సెంచరీలు) ఉన్నాయి?” అని అడిగాడు. విలియమ్సన్ “పిల్లలు!” అని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం విన్న వెంటనే హర్భజన్, యాంకర్, స్టూడియోలో ఉన్నవారందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అసలు ప్రశ్నకు దీని సంబంధమే లేదని గ్రహించిన విలియమ్సన్ కూడా కొంత సిగ్గుపడుతూ నవ్వాడు.
Read Also: Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత
ఇంతలోనే హర్భజన్ మరో సరదా కామెంట్ చేశాడు. “పిల్లలు కంటే నీ దగ్గర చాలా ఎక్కువే ఉన్నాయి!” అని విలియమ్సన్‌ను ఆటపట్టించాడు. హిందీ నేర్చుకోవడంలో విలియమ్సన్ తడబడుతున్నాడని తెలుసుకుని భజ్జీ.. విలియమ్సన్‌కు క్లూ ఇచ్చాడు – “ఇది క్రికెట్ పదం.” అని అన్నాడు. క్లూ ఇచ్చినప్పటికీ విలియమ్సన్ అసలు అర్థాన్ని గ్రహించలేకపోయాడు. కొన్నిసార్లు ప్రయత్నించిన తర్వాతే “శతాబ్దం అంటే 100 పరుగులు” అని అర్థం చేసుకున్నాడు. విలియమ్సన్ ఐపీఎల్ 2024లో ఆడకపోయినా.. తన సరదా నైజంతో అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు. కాగా.. విలియమ్సన్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.