ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సీఎస్కే ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అందులో 5 బౌండరీలు, 1 సిక్స్ ఉంది. ఆ తర్వాత.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను 14 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
Read Also: Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?
ఇన్నింగ్స్ మధ్యలో కెప్టెన్ రాజత్ పాటిదార్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. అతను 32 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఆర్సీబీ చివరి ఓవర్లలో కాస్త స్లోగా ఆడినప్పటికీ.. టిమ్ డేవిడ్ చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు.. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మతీషా పతిరాన 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
Read Also: Salman khan : నా తల్లిదండ్రుల పెళ్లికి మతం అడ్డు రాలేదు : సల్మాన్ ఖాన్