ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరం కాగా.. తాజాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని జీటీ శనివారం అధికారికంగా తెలిపింది. అయితే ఈ సీజన్‌లో ఇంతవరకు స్టార్ ప్లేయర్ ఫిలిప్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 ఏళ్ల గ్లెన్ ఫిలిప్స్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బాల్‌ను ఆపే క్రమంలో గాయపడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసి.. అతడిని బయటకు తీసుకువెళ్లాడు. గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో.. ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. లోయర్ ఆర్డర్లో రెచ్చిపోయే ఫిలిప్స్ జట్టుకు దూరం కావడం జీటీకి ఎదురుదెబ్బ లాంటిదే. ఫిలిప్స్ త్వరగా కోలుకోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఆకాంక్షిస్తోంది.
Also Read: DC vs MI: త్వరగా వెనక్కి వచ్చేయండి.. రోహిత్ శర్మ వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన 9 మ్యాచ్‌లలో మరో 4 విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ చేరుతుంది. టైటాన్స్ జోరు చూస్తే.. సునాయాసంగా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది. సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్ రెచ్చిపోతున్నారు. షారుక్ ఖాన్, రాహుల్ తేవాతియా కూడా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ వికెట్స్ తీస్తున్నారు.