ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
READ MORE: DK Aruna: కేటీఆర్‌కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి.. డీకే అరుణ సవాల్
ఇదిలా ఉండగా.. గుజరాత్ టైటాన్స్‌పై లక్నో గెలిస్తే పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి దూసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడు విజయం సాధిస్తే లక్నో ఖాతాలోకి 8 పాయింట్లు అవుతాయి. మెరుగైన రన్‌రేట్‌ను సాధిస్తే లక్నోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది.
READ MORE: Mamata Banerjee: “వక్ఫ్ చట్టాన్ని” బెంగాల్‌లో అమలు చేయం, అల్లర్లు దేనికి.?
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్ ఫైనల్ XI
నికోలస్ పూరన్, ఐదెన్ మార్‌క్రమ్, హిమ్మత్ సింగ్, రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్వేశ్ సింగ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్