ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్‌ను ఓడించాడు. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై తుఫాను సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు.
Also Read:Hanuman Shobhayatra : నగరంలో ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయాత్ర
సెంచరీ సాధించిన తర్వాత అభిషేక్ ఒక ప్రత్యేకమైన స్లిప్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. సెంచరీ చేసిన తర్వాత అతను తన జేబులోంచి స్లిప్ తీసి అందరికీ చూపించాడు. అభిషేక్ చూపించిన కాగితం మీద ‘ఈ శతకం ఆరెంజ్ ఆర్మీ కోసమే’ అని రాసి ఉంది. వరుస ఓటములతో సన్ రైజర్స్ నిరాశపరుస్తుండగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న వేళ అభిషేక్ ముందుగానే గెలుపుని ఊహించి పేపర్ మీద రాసుకొచ్చి మరి ఊచకోతకు తెరలేపాడు. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో శర్మ 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.
Also Read:Off The Record : కేటీఆర్ అరెస్టును అధికార పార్టీలో అడ్డుకునేది ఎవరు..?
పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 42 పరుగులు, ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేశారు. హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల మధ్య తొలి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హెడ్ 37 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేశాడు. హెడ్ 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ 21 పరుగులతో నాటౌట్‌గా, ఇషాన్ కిషన్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.