KKR vs CSK: నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇక అజింక్య రహానే టీం అండ్ కో ప్లేఆఫ్స్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక మరోవైపు ప్రస్తుత సీజన్ నుండి ఎలిమినేట్ అయినా చెన్నై ఎలాగైనా మరో విజయం సాధించాలని అనుకుంటోంది. ఇక నేటి మ్యాచ్ లో కేకేఆర్ టీంలో గాయంపాలైన వెంకటేష్ అయ్యర్ స్థానంలో మనీష్ పాండే ఆడనున్నారు. అలాగే చెన్నై టీంలో కరన్, రషీద్ స్థానాలలో కాన్వే, ఉర్విల్ పటేల్ లు ఆడనున్నారు. చూడాలి మరి గత సీజన్‌లో కేకేఆర్ జట్టు ఛాంపియన్‌గా నిలవగా.. ఈ సీజన్‌లో మాత్రం ప్లేఆఫ్స్ రేసులో వెనుకపడింది. చెన్నైతో జరిగే ఈ మ్యాచ్ ఐపీఎల్‌లో కేకేఆర్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఆడే ఆటగాళ్ల వివరాలను ఒకసారి చూద్దామా..
Read Also: Asaduddin Owaisi: వైమానిక దాడిలో ఉగ్రవాదుల హతం… అసదుద్దీన్ ఒవైసీ వీడియో వైరల్!
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ సబ్‌లు:
హర్షిత్ రానా, అనుకుల్ రాయ్, లోవ్‌నీత్ సిసోడియా, అన్రిక్ నోర్కియా, మయాంక్ మార్కండే.
Read Also: AI Video: “యుద్ధం ఆపేయండి” మోడీ కాళ్ల మీద పడిన పాకిస్థాన్ ప్రధాని.. వీడియో వైరల్
చెన్నై ప్లేయింగ్ XI:
ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని (c/wk), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతిషా పతిరణ.
ఇంపాక్ట్ సబ్స్:
శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా.