MI vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తడబడింది. గుజరాత్ టైటన్స్ బౌలర్ల దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విఫలమైంది. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ సరిగా లభించలేదు. ఓపెనర్ రికెల్టన్ (2) రెండో బంతికే వెనుదిరిగాడు. అలాగే మరో ఓపెనర్ రోహిత్ శర్మ (7) కూడా నిరాశపరిచాడు. అయితే, మూడో స్థానంలో వచ్చిన విల్ జాక్స్ మాత్రం పర్వాలేదనిపించారు. అతను 35 బంతుల్లో 53 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు చక్కటి తోడ్పడ్డాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 35 పరుగులు చేసి ఆడినప్పటికీ, మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో కొబ్బిన్ బోష్ (27), దీపక్ చహర్ (8 నాటౌట్) కొంత మేరకు స్కోరు పెంచే ప్రయత్నం చేసినప్పటికీ, ముంబై 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది.
Read Also: Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
ఇక గుజరాత్ బౌలింగ్‌లో సాయి కిషోర్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి రాణించాడు. మహమ్మద్ సిరాజ్ రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ, ప్రశిధ్ కృష్ణ చెరో ఒక వికెట్ తీసి ముంబై పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైకి భారీ స్కోరు చేసే అవకాశం దూరమైంది. ఇక చుడాలిమరి గుజరాత్ టార్గెట్ చేజ్ చేసి ప్లేఆఫ్స్ కు చేరుకుంటుందో లేక ముంబై బౌలర్లు గుజరాత్ ను కాటది చేసి ప్లేఆఫ్స్ లో అడుగుపెడుతుందో.