టీమిండియా క్రికెట్ ను సచిన్ ముందు, సచిన్ తర్వాత అన్నట్టుగా విడదీయొచ్చు. బౌలర్లు ఆధిపత్యం చెలాయించే ఆ రోజుల్లో ఓ పదహారేళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ని వణికించేశాడు. పదహారేళ్లకు తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి బౌలర్లకు నైట్ మెర్ గా మారాడు. అంతకుముందు 15 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్లోతారాజువ్వగా దూసుకొచ్చాడు. ఇప్పుడు పద్నాలుగేళ్లకే డబుల్ సెంచరీలతో మోత మోగిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల కుర్రాడు 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తాజాగా మరో ఆణిముత్యం బయటపడింది.
READ MORE: MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
వైభవ్ తరహాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ మహ్మద్ కైఫ్ డెహ్రాడూన్‌లో జరిగిన అండర్-14 రాజ్ సింగ్ దుంగార్‌పూర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. 280 బంతులను ఎదుర్కొన్న కైఫ్ 250 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు 12 సిక్సర్లు నమోదయ్యాయి. ఇటీవల కాన్పూర్‌లో జరిగిన ట్రయల్స్ ఆధారంగా కైఫ్ అండర్-14 UP జట్టులోకి ఎంపికయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో యూపీ విదర్భతో తలపడింది. ఉత్తరప్రదేశ్ తరఫున కైఫ్ 250 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో 377 నిమిషాలు గడిపి 89.29 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. కైఫ్ కీలక ఇన్నింగ్స్ ఆధారంగా యుపి అద్భుత విజయాన్ని అందుకుంది. మహ్మద్ కైఫ్ పేదకుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి మున్నా రోజువారీ కూలీ. క్రికెటర్ కావాలనే తన కలకు తండ్రి సపోర్టుగా నిలిచాడు. అలా గల్లీ క్రికెట్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు ఎదిగాడు కైఫ్. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ,మహ్మద్ కైఫ్ భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
READ MORE: Mock Drill: హైదరాబాద్‌లో రేపు మాక్ డ్రిల్.. సైరన్ మోగగానే ప్రజలు ఏం చేయాలో తెలుసా?