ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధికారిక ఇమెయిల్‌కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. “మీ స్టేడియంను మేము పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ మెయిల్ ‘పాకిస్థాన్’ పేరుతో పంపారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ బెదిరింపు వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు.
READ MORE: Uttam Kumar Reddy: సిడబ్ల్యూసి ఛైర్మన్‌తో మంత్రి భేటీ.. నీటి ప్రాజెక్టులపై కీలక సమావేశం.!
రాబోయే వారాల్లో నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు ముఖ్యమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ వార్త వచ్చిందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం స్టేడియం, పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ బృందం వెంటనే చర్యలు తీసుకుని ఇమెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్‌ను ట్రేస్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
READ MORE: India Slams China: ‘‘ముందు వాస్తవాలు తెలుసుకో’’.. చైనా మీడియాకు భారత్ చురకలు..