ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గెలుస్తుందని మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. క్వాలిఫయర్-1లో తేలిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని ఏబీడీ తెలిపాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన ఆర్‌సీబీ నేరుగా…
ఐపీఎల్ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరికొన్ని గంటల్లో గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ముల్లాన్‌పూర్ పిచ్ నిన్న బౌలింగ్, బ్యాటింగ్‌కు కూడా అనుకూలించింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా మారింది.…
ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఆర్‌సీబీ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఇక ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు ఆర్‌సీబీ అడుగు దూరంలో నిలిచింది.…
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. సహచరులు అయినా, ప్రత్యర్ధులు అయినా.. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఒక్కోసారి దురుసుగా కూడా ఉంటాడు. కీలక మ్యాచ్‌లలో అయితే స్లెడ్జింగ్ చేస్తూ హద్దులు దాటుతుంటాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్.. యువ ఆటగాడిపై విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని, పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారన్నాడు. తాము తక్కువ స్కోర్ లక్ష్యంగా విధించామని, బౌలర్లను ఏమాత్రం నిందించలేం అని చెప్పాడు. మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలన్నాడు. ఇది మర్చిపోలేని రోజు అని శ్రేయాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్‌లో ఆర్‌సీబీకి ఎక్కడా కూడా పంజాబ్…
ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్…
ఐపీఎల్ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గుజరాత్, ముంబై జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. లీగ్ ఆరంభం నుంచి గుజరాత్ టైటాన్స్…
IPL 2025 Final: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26)…