IPL 2024 Today: డబుల్ ధమాకా.. నేడు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే..
ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ మొదటి పోరుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతుంది. జైపూర్ లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియంలో మ్యాచ్ మొదలు కానుంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాయల్స్ హోం గ్రౌండ్ లో గెలిచి శుభారంభం చేయాలని తహతహలాడుతోంది. ఇంకోవైపు ఇటీవలే గాయం నుంచి కోలుకున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్‍నెస్ క్లియరెన్స్ సాధించాడు. గతేడాది ప్లేఆఫ్స్ వరకు చేరిన ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తుంది.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
Also read: Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు చూస్తే.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హిట్మైర్, రియాన్ పరాగ్, రావ్మన్ పోవెల్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ లు ఉన్నారు.
లక్నో సూపర్‌జెయింట్స్ తుదిజట్టు చూస్తే.. క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దేవ్‍దత్ పడిక్కల్, దీపక్ హుడా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, ఆయుశ్ బదోనీ, కృణాల్ పాండ్యా, షెమార్ జోసెఫ్ / నవీనుల్ హక్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ లు ఉన్నారు.
ముంబై vs గుజరాత్:
ఐపీఎల్ 2024లో భాగంలో 5 వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేటి రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వచ్చేశాడు. ఈ రెండేళ్లలో 2022, 2023 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేశాడు. 2022లో గుజరాత్ కు టైటిల్ అందించిన పాండ్యా.. గతేడాది జట్టును ఫైనల్ వరకు కూడా తీసుకెళ్లాడు. ఇక గత రెండు సీజన్లుగా తాను సారథిగా వ్యవహరించిన గుజరాత్ పైనే ఇప్పుడు మళ్లీ ముంబై కెప్టెన్ గా పాండ్యా ఆడనున్నాడు.
గుజరాత్ టైటాన్స్ లో హార్దిక్ పాండ్యా.. ముంబైకు వెళ్లిపోవటంతో కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ శుభ్‍మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. కొత్త కెప్టెన్ ఇప్పుడు జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడోనని కూడా అందరిలోనూ ఆసక్తి ఉంది. దింతో మొత్తానికి ముంబై, గుజరాత్ పోరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఈ మ్యాచ్ తో సీజన్ లో శుభారంభం చేసేందుకు ముంబై, గుజరాత్ జట్లు పట్టుదలగా ఉన్నాయి.
Also read: Weather Department: నేటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
ముంబై ఇండియన్స్ తుదిజట్టు చూస్తే.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నేహాల్ వదేరా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, పియూష్ చావ్లా, జస్‍ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా/క్వెనా ఎంఫకా, ఆకాశ్ మధ్వాల్ గా ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు చూస్తే.. శుభ్‍మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్/అజ్మతుల్లా ఒమర్‌జాయి, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సెర్ జాన్సన్, మోహిత్ శర్మ గా ఉన్నారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!