Shreyas Iyer on KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడారని, అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. కీలక పోరులో మిచెల్ స్టార్క్ గొప్ప ప్రదర్శన చేశాడని, యువ ఆటగాళ్లు తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చని శ్రేయస్…
SRH Register Lowest Score in IPL Finals: సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 113 పరుగులకే ఆలౌట్ అయి ఈ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్…
Kavya Maran Tears After KKR Beat SRH in IPL 2024 FInal: ఐపీఎల్ 2024 ఆసాంతం అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. 17వ…
ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్లో సన్ రైజర్స్ను ఓడించి 3వ సారి కప్ను సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (52*) పరుగులతో రాణించాడు. గుర్బాజ్ (39), సునీల్ నరైన్ (6), శ్రేయాస్ అయ్యర్ (6*) పరుగులు చేశారు. దీంతో.. కోల్కతా సూపర్ విక్టరీ…
ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్కతా బౌలింగ్కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2024 Final : క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు వున్న క్రేజ్ అంత ఇంతా కాదు..ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.తమ అభిమాన టీం గెలవాలని ఎంతగానో కోరుకుంటారు.ఈ ఏడాది ఎంతో ఘనంగా మొదలైన ఐపీఎల్ సీజన్ 2024 ముగింపు దశకు వచ్చేసింది.ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధం అయింది.రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఈ సీజన్ ఫైనల్ ముగింపు దశకు చేరుకోవడంతో క్రికెట్…
ఐపీఎల్(IPL 2024) ఫైనల్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రాత్రి 7.30గంటలకి తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి.