Kavya Maran Tears After KKR Beat SRH in IPL 2024 FInal: ఐపీఎల్ 2024 ఆసాంతం అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. 17వ సీజన్‌లో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్ చేరిన ఎస్‌ఆర్‌హెచ్.. చివరి మెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఫైనల్ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కీలక పోరులో ఎస్‌ఆర్‌హెచ్ కనీస పోటీ ఇవ్వకపోవడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే.. కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీతిని తుడుచుకున్నారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ కూడా పోటీలో నిలవలేకపోయింది. వరుసగా వికెట్స్ కోల్పోవడంతో మ్యాచ్ మధ్యలోనే కావ్య మారన్ ముఖం చాటేశారు. కేకేఆర్ విజయానంతరం మళ్లీ స్టాండ్స్‌లోకి వచ్చారు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించారు. ఈ క్రమంలోనే ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వీడియోను చూసి ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ‘అయ్యో.. కావ్య పాప’, ‘పాపం కావ్య పాప’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kavya Maran was hiding her tears. 💔
– She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024