IPL 2024 Final : క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు వున్న క్రేజ్ అంత ఇంతా కాదు..ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.తమ అభిమాన టీం గెలవాలని ఎంతగానో కోరుకుంటారు.ఈ ఏడాది ఎంతో ఘనంగా మొదలైన ఐపీఎల్ సీజన్ 2024 ముగింపు దశకు వచ్చేసింది.ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధం అయింది.రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఈ సీజన్ ఫైనల్ ముగింపు దశకు చేరుకోవడంతో క్రికెట్ అభిమానులు ఈ సారి ట్రోఫీ ఎవరికీ దక్కుతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also :Salaar 2 : “సలార్ 2” ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
లీగ్ స్టేజి లో టాప్ 2 లో నిలిచినా సన్ రైజర్స్ హైదరాబాద్ ,కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య నేడు హోరా హోరి పోరు జరగనుంది.నేడు (మే 26 )చెన్నై చిదంబరం స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది.కోల్ కతా టీం ఇప్పటికే రెండు సార్లు ట్రోఫీ అందుకొని మూడోసారి సాదించేందుకు ఎంతగానో ఎదురుచూస్తుంది.అలాగే రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతో పట్టుదలతో వుంది.దీనితో ఇవాళ్టి మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగనుంది.ఇదిలా ఉంటే టాలీవుడ్ సెలెబ్రెటీస్ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలని వీడియో రూపంలో స్పెషల్ విషెస్ తెలియజేసారు.నాగార్జున,విక్టరీ వెంకటేష్ ,విజయ్ దేవరకొండ ,విశ్వక్ సేన్ ,అంజలి ,శ్రీనివాస్ రెడ్డి ,రాజ్ తరుణ్ ,అల్లరి నరేష్ వంటి తదితరులు విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రికార్డులు బ్రేక్ అయ్యాయ్
స్టేడియాలు హోరెత్తిపోయాయ్ 💥మరి సునామీ సృష్టించిన @SunRisers కు సెలబ్రిటీస్ సెండ్ చేసిన స్పెషల్ విషెస్ చూసేయండి 🤩
చూడండి#TATAIPL ఫైనల్
Kolkata v Hyderabad | 5:30 PM నుంచి
మీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu pic.twitter.com/wvrifqWt6U— StarSportsTelugu (@StarSportsTel) May 26, 2024