ఆదివారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో 70వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ టేబుల్ టాపర్ల యుద్ధాన్ని చూస్తుంది. ఎందుకంటే.. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో నేడు రాత్రి 7:30 కు తలపడనున్నాయి. రెండు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నందున, ఈ మ్యాచ్ క్వాలిఫైయర్స్ కు ముందు విజయంతో వారి మనోస్థైర్యాన్ని పెంచే అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 69వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మే 19 న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఇరుజట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడాయి. ఎస్ఆర్హెచ్ 15 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, పిబికెఎస్ 7 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. Hyderabad…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సీఎస్కే.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ…
బెంగళూరులో గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. కాగా.. ఈరోజే వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే.. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ జరుగుతుందా అన్న సస్పెన్స్ కు తెరదించింది. ఆర్సీబీ, సీఎస్కే అభిమానులకు కర్ణాటక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. కాసేపట్లో జరగనున్న నాకౌట్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచనలు లేవు.. రాత్రి వరకు అనుకూల పరిస్థితులే ఉన్నాయని ట్వీట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు.. అటు ఆర్సీబీ అభిమానులు,…
ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే అనుమానాలొచ్చేలా కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీతో ఈరోజు మ్యాచ్ ఆడుతున్నానని.. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో అని కోహ్లీ తెలిపారు. వచ్చే సీజన్ లో ధోనీ ఆడుతాడో, ఆడడో.. ఎవరికి తెలుసని పేర్కొన్నారు. అయితే.. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు పండగేనని, అద్భుతమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. మేమిద్దరం కలిసి భారత్ తరఫున చాలా సంవత్సరాలు ఆడామని.. జట్టును ఎన్నోసార్లు…
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచ్ ల్లో ప్రతిసారి గెలుస్తూ వస్తోంది. 2013లో సీఎస్కే, 2014లో సీఎస్కే, 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2023లో సన్ రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్లోనూ ఇదే కొనసాగుతుందని, సీఎస్కేపై…
సహాయక సిబ్బందితో పాటు ఎక్కువ మంది భారత ఆటగాళ్ళు మే 25 న న్యూయార్క్ కు బయలుదేరుతారు. మిగిలిన వారు మే 26 ఐపిఎల్ ఫైనల్ తర్వాత మాత్రమే టి 20 ప్రపంచ కప్కు బయలుదేరుతారు. అంతకుముందు, ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన జట్ల సభ్యులు మే 21 న న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. మే 19 న ఐపిఎల్ చివరి లీగ్ ఆట జరిగిన రెండు రోజుల తరువాత, ప్రణాళికలలో కొంత మార్పు వచ్చిందని.,…