ఇండియన్ ప్రీమియర్ లీగ్ 69వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మే 19 న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఇరుజట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడాయి. ఎస్ఆర్హెచ్ 15 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, పిబికెఎస్ 7 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది.
Hyderabad Metro: మెట్రో టైంలో మార్పులేదు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
మహారాజా యాదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 23వ మ్యాచ్లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 182/9 పరుగులు చేసింది. ఇందులో నితీష్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో పీబీకేఎస్ కు మంచి ఆరంభం లభించలేదు. అయితే, శశాంక్ సింగ్, అశుతోష్ మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లారు. కానీ, వారి ప్రయత్నాలు సరిపోలేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ 2 పరుగుల తేడాతో కోల్పోయింది.
ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కి ముఖ్యమైనది కానప్పటికీ, సన్ రైజర్స్ మ్యాచ్ గెలుచుకోవడానికి, మొదటి రెండు అర్హతల అవకాశాలను సజీవంగా ఉంచడానికి ఆసక్తిగా ఉంటుంది. ఇక హైదరాబాద్ లో గత రెండు రోజుల నుండి కూడా వాతావరణంలో మార్పులు రావడంతో వర్షాలు కురుస్తున్నాయి. చివరిసారి జరగాల్సిన గుజరాత్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయినా సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈరోజైనా వరుణదేవుడు కరుణిస్తాడా లేదా అన్నది.