ఆదివారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో 70వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ టేబుల్ టాపర్ల యుద్ధాన్ని చూస్తుంది. ఎందుకంటే.. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో నేడు రాత్రి 7:30 కు తలపడనున్నాయి. రెండు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నందున, ఈ మ్యాచ్ క్వాలిఫైయర్స్ కు ముందు విజయంతో వారి మనోస్థైర్యాన్ని పెంచే అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది.
SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్ రైజర్స్.. వరుణదేవుడు కరుణిస్తాడా..
సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మొదటి అర్ధభాగంలో వారి మొదటి తొమ్మిది మ్యాచ్లలో ఎనిమిదింటిని గెలుచుకుంది. అయితే, గత నాలుగు మ్యాచ్ల్లో వరుస ఓటములను చవిచూసినందున వారి ప్రయాణం కాస్త దడ పుట్టిస్తుంది. యశస్వి జైస్వాల్ పేలవమైన బ్యాటింగ్ ఫామ్ తో పాటు, జోస్ బట్లర్ లేకపోవడం వల్ల రాయల్స్ కు కాస్త ఎదురుదెబ్బే.
మరోవైపు, కోల్కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాలలో చాలా అద్భుతంగా ఉంది. వారు బ్యాట్, బంతితో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. తమ ప్రత్యర్థులతో సులభంగా గెలుస్తున్నారు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తమ ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించగా., వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశి, నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అవసరమైనప్పుడు ముందుకు వారి ప్రతిభను చాటుతున్నారు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలక వికెట్లు తీయడంతో వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో బంతితో మెరుస్తున్నాడు.